Prabhas Varadhi Story Line
ప్రభాస్, అనుష్క కాంబినేషనలో కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'వారధి'. ఈ చిత్రంలో కథ గురించి ప్రభాస్ మాట్లాడుతూ... మనసు, అద్దం రెండూ ఒక్కటే. ఒక్కసారి ముక్కలైపోతే మళ్లీ అతుక్కోవు అంటుంటారు. కానీ అలాంటి మనసులకూ మరమ్మత్తులు చేశాడో యువకుడు. అతని కథేంటో తెలుసుకోవాలంటే మా సినిమా చూడాల్సిందే అన్నారు. ఈ చిత్రంలో అనుష్కతో పాటు మరో హీరోయిన్ గా రిచా గంగోపాధ్యాయ నటిస్తోంది. యు.వి.క్రియేషన్స్ సంస్ద ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. వి.వంశీకృష్ణ, ప్రమోద్ నిర్మాతలు.
ఇక ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం రామోజీ ఫిల్మ్‌సిటీలో చిత్రీకరణ జరుగుతోంది. రైల్వేస్టేషన్ నేపథ్యంగా ఫైట్ సీన్స్ చిత్రీకరిస్తున్నారు. ఫైట్ మాస్టర్ అనల్ అరసు నేతృత్వంలో వాటిని షూట్ చేస్తున్నారు. ''మనసుల్ని కలిపే వారధి లాంటి యువకుడి కథ ఇది. సున్నితమైన భావోద్వేగాలతో అల్లుకొన్న ఈ కథలో కావల్సినంతగా యాక్షన్ అంశాలుంటాయి. ప్రభాస్‌ని కొత్తగా చూపించబోతున్నాము''అన్నారు నిర్మాతలు. సత్యరాజ్, నదియా ముఖ్య పాత్రల్లో కనిపిస్తారు. ఎగ్జిక్యూటివ్ నిర్మాత: అశోక్‌కుమార్ రాజు, ఛాయాగ్రహణం: మది, సంగీతం: దేవిశ్రీప్రసాద్.
Category: film news