Pawan Kalyan’s interview about Gabbar Singh
Powerstar Pawan Kalyan’s Gabbar Singh is running with packed theatres everywhere and fans are celebrating this movie release like a festival.
In the past 11 years, pawan’s craze was going up but his movies were not meeting up the expectations, though Jalsa (2008) managed to satisfy to some extent.
In the past 11 years, pawan’s craze was going up but his movies were not meeting up the expectations, though Jalsa (2008) managed to satisfy to some extent.
Fans were claiming that if Pawan gets a proper script, he will erase all previous industry records and symptoms are already seen in opening collections of this movie.
Pawan Kalyan has given an interview during his flight journey about this sensational movie.
Read this exclusive interview in Telugu :
Read this exclusive interview in Telugu :
ప్లైట్ లో సాగిన ఈ ఇంటర్వూలో … యాంకర్ అడిగిన ప్రశ్నలకు నవ్వుతూ చాలా వివరణగా సమాదానమిచ్చారు. ఆ ఇంటర్వూ ఇదే..
కళ్యాణ్ గారూ..గబ్బర్ సింగ్ లాంటి టపోరి, పవర్ ఫుల్ పోలీస్ క్యారెక్టర్ చేయాలని ఎందుకనిపించింది.
పవన్: చేయాల్సి వచ్చింది(నవ్వుతూ)…ప్రత్యేకించి, చాలా దీర్ఘంగా ఆలోచించి,చాలా పరిశోదించి అని కాదు కానీ, పోలీస్ క్యారెక్టర్ అని చూడలేదు… జనం నా నుంచి ఎంటర్టనర్మెంట్ ఆశిస్తారు. నేను చూసినప్పుడు ఈజీగా ఐడింటిఫై అయ్యాను..అందుకే చేసాను..
ఆ గబ్బర్ సింగ్ అరెవో సాంబా అంటే ..ఈ గబ్బర్ సింగ్ ఏమంటాడు
పవన్: చాలా అంటాడు…చాలా చాలా ఉన్నాయి. అవన్నీ డిజైన్ చెయ్యటానికి, అందరూ నేను ఇలాంటివి చేస్తే బాగుంటుంది అని ప్రతీవారి మనస్సులో ఉండే అలోచనలన్నిటినీ కలిసి హరీష్ చక్కటి స్క్రీన్ ప్లే చేసాడు. అలాంటి సీన్స్ అన్నిటికీని కలిపి బ్యూటిఫుల్ గా స్క్రీన్ పై ప్రెజెంట్ చేసాడు.
పవన్: నాక్కొంచెం తిక్కుంది… కని దానికో లెక్కుంది అని హరిష్ గారు వచ్చి చెప్పినప్పుడు…మీకు ఏమనిపించింది.
బేసిగ్గా మీకు కొద్దిగా తిక్క ఉందని బయిట అందరూ అనుకుంటూంటారు అని హరీష్ చెప్పాడు. అదే పెట్టేసాడు. అది విన్నప్పుడు నాకే నవ్వు వచ్చింది.
దేవి శ్రీ ప్రసాద్ అల్టిమేట్ విశ్వరూపం చూపించారు అని ఇండస్ట్రీ లో అంటున్నారు.మీరేమి అంటారు.
పవన్: దేవి ఇండస్ట్రీకి రానప్పుడు ఫస్ట్ మ్యూజిక్ ఆల్బమ్ నేనే రిలీజ్ చేసాను..మాండలీన్ శ్రీనివాస్ గారి వద్ద ప్రాక్టిస్ చేసినప్పుడు నుంచి తెలుసు..హైలీ ఎనర్జిటిక్ గై…జల్సాకి అతని మ్యూజిక్ కి నేనే సరిగ్గా ప్రెజెంట్ చేయలేనిపించింది.
గబ్బర్ సింగ్ లో మీకు నచ్చిన మీ ఫేవరెట్ సాంగ్ ఏమిటి
పవన్: మిగతా పాటలన్ని నచ్చాయి కానీ…కోట గారు పాడిన పాట..అలాగే ఫోక్ మిక్స్ చేసి దేవి చేసిన పాట…కూడా బాగుంది(ఆకాశం అమ్మాయి అయితే…)
శృతి హాసన్ కి యాక్టింగ్ గురించి చెప్తారా
పవన్: ఆమెకు ఇంకా మంచి పాత్రలు రాలేదని అనిపించింది..ఆమె వెరీ గుడ్ ఫెరఫార్మర్..ఆమె ఈ సినిమాలో రెండు మూడు సీన్స్ లో బాగా చేసింది. ఆమె చాలా ఎమోషనల్ వ్యక్తి అని తెలిపేందుకు ఈ సినిమాలో రెండు మూడు సీన్స్ ఉన్నాయి. వాటిలో ఆమె చాలా బాగా చేసిందనిపించింది.
హరీష్ శంకర్ గారి మాటలు నచ్చాయా…డైరక్షన్ నచ్చిందా
పవన్: మన తెలుగు ఆడియన్స్ చాలా ఎంటర్టన్మెంట్ కోరుకుంటారు..అలాగే ఫార్మెట్ ఒకటే ఉంటుంది. అలాంటప్పుడు దాన్ని కొత్తగా చెప్పటం చాలా కష్టం. హరీష్ ..కథని ఎలా ఎడాప్ట్ చేసుకుంటే బావుంటుందో..ఎలా కన్వే చేస్తే బావుంటుందో తెలుసు. అంతకు ముందు కూడా నేను మిరపకాయ చేయాల్సింది కానీ..వేరే కారణాల వల్ల నేను చెయ్యలేకపోయాను..అప్పటి నుంచీ నాకు తెలుసు..అతను ప్రతీ హీరోకి ఎడాప్ట్ అవ్వగలడు..అతని స్కిల్స్ లో డైలాగులు ఒకటే కాకుండా ఒక్కోసారి..కొంతమంది కథను బాగా రాయగలరు..రాసినంత బాగా తెరకెక్కించలేరు..హరీష్ ఎంత బాగా రాయగలడో అంత కన్నా ఇంకా బాగా తెరకెక్కించగలడు..చాలా పాస్ట్ అతను..అతని పేస్ తట్టుకోలేము..సాధారణంగా ఒక షాట్ కోసమో,మరో దాని కోసమో వెయిట్ చేస్తూంటే సహనం చచ్చిపోతుంది..హరీష్ దగ్గర ఆ ఎంతూయాజమ్ అలాగే ఉంటుంది. టైమ్ ని వేస్ట్ చేయడు. అలాగే హరీష్ దగ్గర మెక్యూరి ధింకింగ్ ఉంది. చాలా పాస్ట్ గా ఛేంజి కావాలంటే చేసి చూపించగలడు. అతను కథా పరంగానే కాకుండా తీసే విధానం, అందరితో నడుచుకునే విధానం చాలా బాగుంది.
కళ్యాణ్ గారూ…గబ్బర్ సింగ్ ప్రొడ్యూసర్ బండ్ల గణేష్ గారు గురించి చెప్పండి…గణేష్ గారి విషయానికి వస్తే..సినిమా తర్వాత సినిమా అంటూ యంగేజ్ లో పెడుతున్నారు. మిమ్మల్ని ప్లాట్ చేయటమంటే చాలా కష్టం. గణేష్ గారికి అది ఎలా సాధ్యమైంది?
పవన్: లేదు..లేదు…అది యాంబిషియస్ ఎచీవ్…విపరీతమైన సహనం ఉంది..ఒక పని సాధించటానికి కావాల్సిన తపన ఉంది..ఆ పని కోసం విపరీతమైన కష్టం పడగలడు. అంటే ..చిన్న పని చేయాలన్నా చాలా ఆటుపోట్లు తింటూంటాం. అతను ఎలాగైనా పనిని సాధించగలడు. అతనికున్న ఎంతయూజమ్ నచ్చింది. మ్రొక్కుబడిగా చెయ్యాలి కాబట్టి తప్పదు..అన్నట్లు ఉండదు..గణేష్ ది ఎట్లా ఉంటుంది అంటే ఇది చెయ్యాలి అనుకుంటే చేసేస్తాడు…ఆల్రెడీ తను సుస్వాగతం లో నాతో పాటు యాక్ట్ చేసాడు. అప్పటినుంచీ తెలుసు…తను గురించి మాట్లాడాలంటే నాకు నవ్వు వస్తుంది..ఎందుకంటే మా ఇద్దరి మధ్యా పర్శనల్ గ ఉన్న సరదాలు ఉంటాయి కదా అందుకే నవ్వు వస్తుంది. బట్..ఇయ్యన్నీ ప్రక్కన పెడితే హీ ఈజ్ సీరియస్ ఫిల్మ్ మేకర్..అతనిలో నచ్చే గుణం ఏమిటంటే..సాధారణంగా మనిషికి ఓటమి రాగానే డీలా పడిపోతారు అందరూ..కానీ గణేష్ లో ఓటమి వచ్చే కొద్ది అతిలో ఇంతూయజమ్ పెరిగుతూంటుంది…ఉత్సాహం పెరుగుతూంటుంది.సాధించాలన్న పట్టుదల పెరుగుతుంది. ఇవన్నీ చూసి అతనితో కొనసాగుతున్నాను..
గణేష్ గారిలో బాగా నచ్చేవి ఈ ఓర్పు..సహనం అంటారా?
పవన్: పట్టుదల..రెండు ఏంటంటే..చాలా వాస్తవంగా ఉంటాడు. అంటే నా డేట్స్ కావాలి..కానీ నీకు ఇంతే ఇస్తాను అని చెప్తాడు. చాలా కమిటెడ్ గా ఉంటాడు. అలాగే గాలిలో తేలే మాటలు మాట్లాడడు. స్పీచ్ లలో బాగా మాట్లాడతాడు కానీ..వాస్తవం లోకి వచ్చేసరికి..ప్రాక్టికల్ గా చెప్తాడు. అతని కష్టానికి,ఓర్పుకి అతను ప్యూచర్ లో తెలుగు పరిశ్రమ గర్వించతగ్గ నిర్మాత అవుతాడు. ఇవన్నీ ఎందుకండి అతను ఫ్యాసనేట్ ప్రొడ్యూసర్.
ఇన్ని రోజులు మీరు ఈ క్యారెక్టర్ ని దాచేసారు…ఎందుకు దూరంగా ఉన్నారు?
పవన్: అంటే నేనెప్పుడూ సినిమాలు డిజైన్ చేసుకోను..ఇలాంటి స్పెసిఫెక్ క్యారెక్టర్ చెయ్యాలని అనకోను..నేనేం నమ్ముతాను అంటే సినిమాలు డిజైన్ చేస్తే నేను నమ్మను..సహజసిద్దంగా మానసిక ఎదుగుదలను బట్టి..ఆ పరిశరాలు వాటని బట్టి చెయ్యాలనుకుంటాను తప్ప నేను ప్రేక్షకులను ఆకట్టుకోవాలి..ఇలా చేస్తే..నచ్చుతుంది..అలా నేను ఆలోచించను..అది నేను చెయ్యలేని పని..ఇది నా ప్రాసెస్ లో వచ్చింది తప్ప…ప్రత్యేకించి నేనేమీ ఆలోచించలేదు.
గబ్బర్ సింగ్ సినిమాలో మీరు చేసిన మార్పులు ఎలాంటివి
పవన్: నేనేం చెయ్యలేదండి..మొత్తం హరీష్ చేసాడు..నాకు చెప్పిందల్లా..నేను మిమ్మల్ని ఎలా చూడాలనుకుంటున్నామో..అలా చూపిస్తాను అని..అలాగే చూపించాడు.
సుహాసిని గారు మీ మదర్ క్యారెక్టర్ వేసారు..ఆమె మీ అన్నయ్యగారితో కూడా చేసారు కదా
పవన్: ఆమె నాకు చెన్నైలో ఉన్నప్పటినుంచీ తెలుసు..ఇట్స్ ఎ నైస్ ఎక్సపీరియన్స్..అంటే మాకు ఆమె చిన్నప్పటినుంచీ మా కుటుంబ సభ్యుల్లో ఒకరిలాగ ఉంటూ వచ్చింది. నాకు మా అక్కతో ఉంటే ఎలా ఉంటుందో ..అలా ఉంటుంది. అల్మోస్ట్ నేను టీనేజ్ లో ఉన్నప్పటినుంచి ఆవిడ తెలుసు..ఆ సీన్స్ లో ఆ ఇంటిమసీ రిప్లెక్ట్ అయ్యింది.
స్పెషల్ గా ఈ గబ్బర్ సింగ్ నుంచి ఏమి ఎక్సపెక్ట్ చేయవచ్చు…
పవన్: అలా చెప్పలేనండి..ఇది అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనింగ్ అనాలి. లాస్ట్ షాట్ దాకా ఎంటర్టన్మెంట్ ఉంటుంది. నాకైతే ఐ గోటు మై హోమ్ అనిపించింది.
సినిమాలో బాగా నచ్చిన సీన్…
పవన్: ఎక్సట్రీమ్ పీక్ ఉన్నది మాత్రం..రౌడీలతో సరదా సన్నవేసం.
కొంచెం పర్శనల్ క్వచ్చిన్…మీరు ఖాళీ టైమ్ లో ఏం చేస్తూంటారు..మీ హాబీస్ ఏంటి
పవన్: ఖాళీ సమయాల్లో ఏమి చెయ్యాలా అని ఆలోచిస్తూంటాను..ఇదివరకు చాలా చెప్పేవాడిని..చాలా చేస్తూంటాను..పుస్తకం చదువుతూంటాను.
ఎలాంటి పుస్తకాలు చదువుతారు..
పవన్: ఎక్కువగా…నాన్ ఫిక్షన్ చదువుతాను…నవల్స్ చాలా తక్కువ…అలాగే తెలుగు సాహిత్యం
ఇక మీరు ఏ ప్లేస్ కి వెళ్లి బాగా ఎంజాయ్ చెయ్యాలనుకుంటారు
పవన్: నాకైతే హైదరాబాద్ కాఫీ షాప్ లకు వెళ్లి కూర్చుని తాగాలని ఉంటుంది. అది నా కోరిక..అది ఇప్పటివరకూ జరగలేదు..చిన్నప్పుడు చేద్దామంటే..పనిపాటా లేదు మళ్లీ టీ షాప్ లలో కూడా కూర్చుంటావా అంటారు. ఇప్పుడు వెళ్దామంటే కుదురదు. నా కోరిక..అలా ఇరానీ టీ హోటల్ లో కూర్చుని అలా మాట్లాడుకూంటూ చాయ్ తాగాలని…
ఎవరితో వెళ్లటం ఇష్టం…
పవన్: ఆ టైమ్ లో నాకు నచ్చిన వ్యక్తులు ఎవరెవరు ఉంటారు..గణేష్,హరీష్..అంటే నా మనస్తత్వానికి దగ్గరగా ఉండి..సరదాగా ఉండే వ్యక్తులతో వెళ్లాలనుకుంటాను..
అంటే అబ్బాయిలతో వెళ్లటమే ఇష్టపడతారు…
పవన్: ఖచ్చితంగా…(నవ్వుతూ) నిజంగా అమ్మాయిలు ఎప్పుడూ ఆలోచన రాదు..
మీకు ఇష్టమైన ఫుడ్ ఏంటండి
పవన్: నేను విపరీతమైన ఉపవాశంలో ఉంటూంటాను..కొవ్వు,అహంకారం పెరగకుండా ఉండటానికి చేస్తూంటాను..సోమవారం,ఏకాదశి వంటివి చేస్తూంటాను..అప్పుడు బాగ ఆకలేసినప్పుడు నాకు ఇష్టమైన ఫుడ్ ఏమిటో తెలుస్తుంది. అప్పుడు సరైన మోతాదులో తింటాను..
ఇప్పటికే చాలా సాధించారు..మీ గోల్స్ ఏమైనా ఉన్నాయా
పవన్: అసలు నేను సాధించాలని ఏమీ రాలేదు..ఎప్పుడూ ఏదో ఒక పని చేయాలనుకున్నాను…ఏ పని చేసినా అత్యంత శ్రధ్దతో చేయటం ఇష్టం నాకు..తప్పించుకోవటానికి ప్రయత్నించను..నా సాయి శక్తులా నాకు కుదిరినంతవరకూ కష్టపడతాను..ఆ రోజు కి ఎంత స్ధాయి ఆలోచనా స్దాయి ఉందో దాన్ని పరిపూర్ణంగ వాడుకుంటాను…ఆచరణలో పెడతాను..ఇన్ని సినిమాలు చేయాలో..ఇన్ని ఘన విజయాలు సాధించాలో అనుకోలేదు..
ఒక వేళ మీరు హీరో కాకపోయి ఉంటే ఏమి అయ్యి ఉండేవారు.
పవన్: వాస్తవానికి ప్రతికూల పరిస్దితులు వచ్చినప్పుడు మనమేంటో తెలుస్తుంది…నిజానికి నా ఫస్ట్ సినిమా స్టార్ట్ అవటానికి చాలా కాలం పట్టింది. అప్పుడు వేరే పనికి వెళ్లలేదు..అది చెయ్యలేను.. ఇదీ అవదు..వెయిట్..వెయిట్..చాలా ప్రస్దేషన్…అప్పుడు ఇంట్లోంచి పారిపోదామనుకున్నాను..మా అమ్మకి కూడా చెప్పేసా…బెంగుళూరులో ఓ నర్శరీలో పనిచేద్దామనుకున్నాను…మేబి గార్డనర్ అయ్యుండేవాడని..నాకున్న ఎబిల్టీస్ కి అంతకు మించి మరేది కాకపోదును .. అంటూ ముగించారు.
Category: film news