GabbarSingh Highlight Dialogues
ఈ రోజు అంతటా విడుదలైన గబ్బర్ సింగ్ డైలాగ్స్ విషయంలో పంచ్ లతో పవన్ అదరకొడుతున్నట్లు సమాచారం. వాటిలో మచ్చుకు కొన్ని...
పవన్ సుహాసినితో....పది మంది కోసం మంచి చేద్దాం అనుకునే వాడిని, పది కాలాలు బ్రతకాలని దీవించు అమ్మా
నాకు నేనే పోటీ. నాతో నాకే పోటీ...నాతో ఎవరూ పోటీకి రారు,రాలేరు..
విలన్ : ఎవడ్రా నువ్వు ?
పవన్ : పేరు గోత్రాలు చెప్పటానికి నేను ఏమైనా గుడికొచ్చానేంట్రా? ...తెలుసుకోవడాలు ఏమి ఉండవు...తేల్చుకోవడాలే...
నాక్కొంచెం తిక్కుంది...కానీ దానికో లెక్కుంది.
గబ్బర్ సింగ్ స్టేషన్ నుంచి తప్పించుకోవటము అంటే పారిపోవటం కాదు..పైకి పోవటం
పేరంటం అన్నాక లేడీసు పేకాట అన్నాక పోలీసులు రావడం మామూలేరా..ఎవరి తాంబూలం వారికిచ్చేయాలి..
బ్రహ్మానందంతో చత్రపతిలోని ఒక్క అడుగు పేరడి..
పవన్ : నీ బలుపు ఆవేశం మడిచి లోపల పెట్టుకో...బయిట రానీయకు...చావటానకి కూడా కంగారేంటిరా నీకు(ఇంటర్వెల్ ముందు డైలాగు)
అవతలి వాడు మనల్ని చంపటానకి వచ్చినప్పుడు మనం చావాలా లేక చంపాలా? ...చంపాలి..అదీ లెక్క
పరమేశ్వర ఆర్ట్స్ అధినేత బండ్ల గణేశ్ ఈ భారీ చిత్రాన్ని నిర్మించారు. శ్రుతిహాసన్, మలైకా అరోరా, అభిమన్యుసింగ్, కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందం, సుహాసిని, తనికెళ్ల భరణి, అజయ్, నాగినీడు, రావు రమేష్, గిరి, ఫిష్ వెంకట్, ప్రభాస్ శ్రీను, ఆలీ, సత్యం రాజేష్, మాస్టర్ ఆకాశ్, మాస్టర్ నాగన్ తదితరులు నటించిన ఈ చిత్రానికి ఫొటోగ్రఫీ: జైనన్ విన్సెంట్, సంగీతం: దేవిశ్రీప్రసాద్, ఎడిటింగ్: గౌతంరాజు, సమర్పణ: శివబాబు.
Category: film news