తారల సౌందర్య రహస్యాలు

Hot nd spicy | 20:10 |

అందం. ఈ పదం చాలా చిన్నదే అయినా దీని ప్రభావం చాలా ఎక్కువ. అందాన్ని ఆస్వాదించని వారుండరు. అందం అనే పదం మగువలకు సొంతంగా మారిందని చెప్పకతప్పదు. సినీ తారల విషయానికొస్తే వారికి సౌందర్య మే సగం బలం. అందాన్ని మెరుగుపరచుకోవడం కోసం పలుపాట్లు పడుతుంటారు. రకరకాల టిప్స్‌ను ఉపయోగిస్తుంటా రు. అలాంటి హీరోయిన్ల సౌందర్య రహస్యాలేమిటో చూద్దాం..

యోగాతోనే..
చెన్నై సుందరి త్రిష తొలిరోజుల్లో మిస్ చెన్నై కిరీటాన్ని గెలుచుకుంది. ఆమె తన సౌందర్య రహస్యం గురించి చెబుతూ మొదట్లో పలు బ్యూటీ ప్రొడక్ట్స్ వాడేదాన్నని చెప్పారు. ప్రస్తుతం తన అందానికి కారణం యోగాతో పాటు క్రమం తప్పని ఎక్సర్‌సైజులేనని పేర్కొన్నారు. ఎక్కడ ఉన్నా క్రమం తప్పకుండా యోగా చేస్తానని తెలిపారు. అందువల్ల డైట్ గురించి ఆలోచించనని వెల్లడించారు. నిద్రకు ఉపక్రమించే ముందు ఆయిల్ మసాజ్‌తోపాటు హెయిర్ వాష్ చేసుకోవడం అలవాటని చెప్పారు.

నా అందానికి కారణం ఆల్ ఈజ్ వెల్ థింకింగే
ఇటీవల తమిళ చిత్ర పరిశ్రమలోకి ప్రవేశించి తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న ఉత్తరాది భామ తాప్సీ. తనదైన స్టైల్‌లో సోయగాలు విరబోస్తూ కుర్రకారు గుండెల్లో గుబులు పుట్టించే ఈ ముద్దుగుమ్మ తన సౌందర్య రహస్యం గురించి చెబుతూ ఎప్పుడూ దేని కోసమో వెంపర్లాడకుండా సంతోషంగా ఉండడమే అసలు రహస్యమని చెప్పారు. ఆకలి అనిపించినప్పుడే ఆహారం తీసుకుంటానని పేర్కొన్నారు. నూనె పదార్థాలకు దూరంగా ఉంటానని పేర్కొన్నారు. మంచినీళ్లు ఎక్కువగా తాగుతానని తెలిపారు. అందువల్లే తన శరీరం అందంగా ఉందని తెలిపారు.

బ్యూటీపార్లర్‌కు పోలేదు
తన శరీర మెరుగుల కోసం ఇంతవరకు బ్యూటీ పార్లర్ గుమ్మం ఎక్కలేదని అంగాడి తెరు అంజలి పేర్కొన్నారు. ప్రకృతి సిద్ధమైన సౌందర్య సాధనాలనే ఉపయోగించమని అమ్మ చెబుతుందని అన్నారు. రోజూ బాదంపప్పు తింటానని, వాటి పిండినే ముఖానికి రాసుకుని, తరువాత వాష్ చేసుకుంటే ముఖం మిలమిల మెరుస్తుందని తెలిపారు. తలకు చంబరుతి సీకాయ్ పొడినే వాడతానని చెప్పారు. సమయం లభించినప్పుడల్లా ఫ్రెష్ వాటర్‌తో ముఖం వాష్ చేసుకుంటానని పేర్కొన్నారు.

బొప్పాయితో ఫ్రెష్
కేరళ కుట్టి అమలాపాల్ తన సొగసు గురించి చెబుతూ నూనె వంటకాలకు దూరంగా ఉంటానన్నారు. ఇంట్లో ఉన్నప్పుడు తలకు నూనె పట్టించి స్నానం చేస్తానని పేర్కొన్నారు. సీజన్‌కు తగ్గట్టుగా లభించే పండ్లను చక్కగా భుజిస్తానని చెప్పారు. తన శరీరం మెరుపునకు ముఖ్య కారణం బొప్పాయి పండు అని వెల్లడించారు. బొప్పాయి గుజ్జు ఒంటికి అప్లై చేసి స్నానం చేస్తే యమ ఫ్రెష్‌గా ఉంటుంది తెలుసా? అంటూ రాగాలు తీస్తున్నారు నటి అమలాపాల్.

Category:

About GalleryBloggerTemplates.com:
GalleryBloggerTemplates.com is Free Blogger Templates Gallery. We provide Blogger templates for free. You can find about tutorials, blogger hacks, SEO optimization, tips and tricks here!