రితేష్ దేశ్ ముఖ్ తో ప్రియమణి

Hot nd spicy | 06:12 |



 
జెనీలియా భర్తతో ప్రియమణి రొమాన్స్ అంటే...కొంపతీసి ఆ విధంగా ఊహించుకోవద్దు. అసలు విషయం ఏమిటంటే ప్రియమణి త్వరలో రితేష్ దేశ్ ముఖ్ తో కలిసి ఆన్ స్క్రీన్ పై ఓ సినిమాలో రొమాన్స్ చేయనుందట. తెలుగు తమిళంలో సరైన అవకాశాలు లేక కొట్టుమిట్టాడుతున్న ప్రియమణికి తాజాగా ఓ బాలీవుడ్ సినిమాలో అవకాశం వచ్చినట్లు సమాచారం. ఇప్పటికే రామ్ గోపాల్ వర్మ‘రక్త చరిత్ర’, మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన‘రావణ్’ చిత్రాల ద్వారా బాలీవుడ్ జనాలకు పరిచయం అయిన ఈ బ్యూటీపై బాలీవుడ్ దర్శకుడు చంద్రకాంత్ కన్ను పడిందని, రితేష్ దేశ్ ముఖ్ హీరోగా తాను త్వరలో రూపొందించబోయే చిత్రంలో ప్రియమణిని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. షాహిద్ కపూర్ సినిమాలోనూ ప్రియమణికి అవకాశం దక్కినట్లు గాసిప్స్ వినిపిస్తున్నాయి.

దక్షిణాదిన పెద్ద సినీ పరిశ్రమలైన తెలుగు, తమిళంలో ఒకప్పుడు మంచి స్థాయిలో కొనసాగిన ప్రియమణికి ఈ మధ్య అసలు అవకాశాలే లేవు. కేవలం మలయాళం, కన్నడంలో ఒకటి రెండు సినిమాలు మాత్రమే చేస్తోంది. తెలుగులో ఓ చిన్న సినిమాలో అవకాశం వచ్చింది. బహుషా మార్చిలో ఇది ప్రారంభం కావచ్చు. ఇలా డల్ గా సాగుతున్న ప్రియమణి కెరీర్ కు బాలీవుడ్ చాన్సులు మరింత ఊపును ఇస్తుందని అంటున్నారు.

Category:

About GalleryBloggerTemplates.com:
GalleryBloggerTemplates.com is Free Blogger Templates Gallery. We provide Blogger templates for free. You can find about tutorials, blogger hacks, SEO optimization, tips and tricks here!