'బిజినెస్ మ్యాన్'కి 'డాన్ శీను'తో పోలికేంటి?
'బిజినెస్ మ్యాన్'కి 'డాన్ శీను'తో పోలికేంటి?
మహేష్  బాబు తాజా చిత్రం బిజినెస్ మ్యాన్ స్టోరీ పాయింట్ ని పూరీ జగన్నాధ్  రీసెంట్ ఇంటర్వూల్లో రివిల్ చేసిన సంగతి తెలిసిందే. ఆయన మాటల్లో...ఓ  భాయ్‌ని చంపడానికి ఓ పోలీసు అధికారి చేసిన ప్రయత్నం 'పోకిరి'. ఏకంగా భాయ్  అవుదామని రంగంలోకి వచ్చిన ఓ యువకుడి కథ 'బిజినెస్‌మేన్'. ఇది విన్న వారంతా  ఈ స్టోరీ లైన్ ..గతంలో రవితేజ హీరోగా వచ్చిన డాన్ శీను గుర్తుకు  వస్తోందంటూ పోలికలు తెస్తున్నారు. డాన్ శీను చిత్రంలోనూ హీరో రవితేజ...  డాన్ అవ్వాలనే కోరికతో హైదరాబాద్ వస్తాడు. ఆ తర్వాత జరిగే పరిణామాలతో  కథ,కథనం నడుస్తుంది. 
 ఇప్పుడు  ఈ చిత్రంలోనూ బిజినెస్ మ్యాన్ లోనూ మహేష్ ..డాన్ (భాయ్)అవ్వాలనే కోరికతో  ముంబై వస్తాడు. ఈ రకంగా ఈ రెండు కదలూ పోలికలు ఉన్నాయంటున్నారు. ఇక ఈ  చిత్రంలో కాజల్ హీరోయిన్ గా చేస్తోంది. సంక్రాంతిక కానుకగా ఈ చిత్రం ఈ నెల  13న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది. ఈ చిత్రం 16 వందల థియేటర్లలో  విడుదలవుతోంది. అన్ని చోట్లా అడ్వాన్స్ బుకింగ్ ప్రారంభమైంది. ఈ మధ్య  కాలంలో ఇంత భారీ స్థాయిలో ఏ చిత్ర విడుదల కాలేదు. ఈ చిత్ర ఆడియోకు అన్ని  చోట్లా మంచి స్పందన లభిస్తోంది. సార్ వస్తారా పాట విశేషంగా అలరిస్తోంది.
Category: film news

