ఇలియానా బాగా తగ్గించేసింది

Hot nd spicy | 07:38 |

ఇలియానా బాగా తగ్గించేసింది

 


 
 
దేవదాసుతో పరిచయమై పోకిరితో స్టార్ హీరోయిన్ గా సెటిలైన ఇలియానా డేట్స్ కోసం రెండేళ్ల క్రితం వరకూ నిర్మాతలు క్యూ కట్టేవారు.ఆ క్రమంలో దాన్ని క్యాష్ చేసుకుందామని ఆమె రెమ్యునేషన్ ని ఏకంగా కోటి పాతికలక్షలకు పెంచేసింది. అయితే వరసగా తెలుగులో సినిమాలు ప్లాప్ అవటంతో ఆమెకు బుక్ చేసే వారే కరువు అయ్యారు. దాంతో ఆమె తన ప్రస్దానం హిందీ వైపు మరల్చింది. ఇక్కడ మెయిన్ హీరోయిన్ గా నెంబర్ వన్ పొజీషన్ లో ఉన్నామె సెకెండ్ హీరోయిన్ వేషం వేయాల్సి వచ్చింది. దాంతో ఇలియానా మళ్లీ ఇక్కడ ప్రయత్నాలు ప్రారంభించింది. రెమ్యునేషన్ ని పట్టించుకోవద్దు అని, మంచి వేషం ఉంటే చెప్పండని తనకు పరిచయమునన్న నిర్మాతలకు, దర్సకులకు ఫోన్స్ చేస్తోందిట.

అంతేకాకుండా అవకాశాన్ని బట్టి వారిని పర్శనల్ గా కలుస్తోంది. సర్లే ఇంతకీ ఎంత రెమ్యునేషన్ అంటావు అంటే యాభై లక్షలు అయినా పర్వాలేదు అని చెప్తోందిట. మొత్తానికి కాజల్‌, తమన్నా,సమంతల కాంపిటేషన్ కి ఆమె దిగి రాక తప్పలేదు అంటున్నారు. ఇక ప్రస్తుతం ఆమె ఆశలన్నీ స్నేహితుడు చిత్రంపైనే ఉన్నాయి. శంకర్‌ దర్శకత్వంలో తమిళంలో రూపొందుతున్న త్రి ఇడియట్స్‌ చిత్రం తెలుగులో స్నేహితుడు పేరుతో అనువాదం అవుతోంది. దిల్ రాజు ఈ చిత్రాన్ని తెలుగులో అందిస్తున్నారు. శంకర్‌ సినిమా కాబట్టి మినిమం గ్యారెంటీ అని హిట్టయ్యే అవకాశాలు ఎక్కువే ఉంటాయని సినీ పండితులు అంచనా వేస్తున్నారు. అదే జరిగితే ఇలియానాకు మళ్లి పూర్వ వైభవం వచ్చే అవకాశం ఉందని కూడా అంటున్నారు. మరోవైపు అల్లు అర్జున్‌తో త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఇలియానా నటిస్తోంది. ఈ రెండు చిత్రాలపై ఇలియానా భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది.

Category:

About GalleryBloggerTemplates.com:
GalleryBloggerTemplates.com is Free Blogger Templates Gallery. We provide Blogger templates for free. You can find about tutorials, blogger hacks, SEO optimization, tips and tricks here!